
క్రైమర్ మిర్రర్, సినిమా న్యూస్ :- గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో సమంత మరియు రాజ్ నిడుమోరు మధ్య జరిగిన వివాహం గురించి పెద్ద ఎత్తున చర్చ ఇప్పటికీ జరుగుతుంది. ఎన్నో రోజులుగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు రాగా వాటన్నిటిని కూడా డిసెంబర్ ఒకటవ తేదీన వీరు నిజం చేశారు. దాదాపు రెండేళ్ల పాటుగా రిలేషన్షిప్ లో ఉన్నటువంటి వీరిద్దరూ డిసెంబర్ ఒకటవ తేదీన కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో “భూత శుద్ధి వివాహం” పద్ధతిలో ఒకటయ్యారు . అయితే డిసెంబర్ ఒకటవ తేదీన పెళ్లి చేసుకున్న ఈ జంట మరుసటిరోజే హనీమూన్ కు గోవా వెళ్ళినట్లుగా సోషల్ మీడియాలో సమాచారం వైరల్ గా మారింది.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వీరిద్దరు కూడా వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. పెళ్లయిన మరుసటి రోజే హనీమూన్ కు వెళ్లడంతో పలు రకాలుగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య కూడా వేరే హీరోయిన్ ను పెళ్లి చేసుకొని ముందుకు సాగిన సందర్భంలో హీరోయిన్ సమంత కూడా వేరే డైరెక్టర్ ను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. కాగా వీరిద్దరి పెళ్లిపై చాలామంది కూడా పలు రకాలుగా తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేశారు. కొంతమంది వీరు పెళ్లిపై విమర్శలు గుప్పించగా మరి కొందరు మాత్రం వీరి పెళ్లికి మద్దతుగా నిలిచారు.
Read also : పుష్ప-2 తొక్కిసలాట.. శ్రీతేజ్ ఎలా ఉన్నాడో తెలుసా..?
Read also : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి నుంచి చేపల కర్రీ!





