
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా లేదా అనేది సర్వత్ర ఉత్కంఠగా మారింది. ఇప్పటికే మంత్రి పదవి దాదాపు ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎక్కడో ఏదో కొడుతుంది. మునుగోడు నియోజకవర్గంలో మాత్రం కొంతమంది నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సమీకరణాల ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశం లేదని కొందరు అభిప్రాయపడుతుండగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మరి కొంతమంది భావిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది మాత్రం సర్వత్ర ఆసక్తి నెలకొంది.
కొన్ని ప్రాంతాల్లో ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ నేతలతో ఫ్రెండ్లీ బెట్టింగులు కాస్తుండగా మరికొందరు దావతుల పేరుతో సరదాగా బెట్టింగ్ లు కాస్తున్నారు. తమ సార్ కు మంత్రి పదవి వస్తుందో లేదో అని ఆయన అనుచరులు మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా మంత్రి పదవి వస్తే పలానా శాకే వస్తుందంటూ కూడా బెట్టింగులు నడుస్తున్నట్లుగా విశ్వాసనీయ సమాచారం. మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కొందరు అంటుండగా . ఎమ్మెల్యేగానే ఆయనను కలవడం కష్టంగా ఉంటుందని ఇక మంత్రి అయితే తమకు అందుబాటులోకి వస్తార రార అని కొందరు చిన్నచితక కార్యకర్తలు ఆవేదన చెందుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి ..
- 
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎంఐఎందేనా..? – పోటీకి ముందుకు రాని ప్రధాన పార్టీలు
- 
16 రోజులు జైల్లో నరకం చూశా- సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగం
- 
వైఎస్ షర్మిలపై పెరుగుతున్న వ్యతిరేకత- కాంగ్రెస్‌ను వీడుతున్న కడప నేతలు
- 
కాశీనాయన క్షేత్రం కాంట్రవర్సీ – పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన జగన్
- 
టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?
 
				 
					
 
						 
						




