క్రీడలుజాతీయం

దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సి భారత్ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి భారత్ లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 13వ తేదీన శనివారం ఉదయం కోల్కత్తాలో అడుగుపెట్టనున్నారు. అక్కడ స్టార్ హోటల్లో రెస్ట్ తీసుకొని సాయంత్రం స్పెషల్ విమానంలో హైదరాబాదుకు బయలుదేరి వస్తారు. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి తో మెస్సి సరదాగా కాసేపు మ్యాచ్ ఆడనున్నారు. ఇక మరుసటి 14వ తేదీ రోజున మెస్సి ముంబైకి చేరుకొనున్నారు. ముంబైలోని వాంకిడే స్టేడియంలో జరిగేటువంటి ఒక ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తారు అని అధికారులు తెలిపారు. ఇక మూడవరోజు 15వ తేదీ ఢిల్లీ చేరుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కాసేపు ముచ్చటించనున్నారు. అయితే మెస్సి మొదటి రోజు కోల్కత్తాలో అడుగుపెట్టగానే ఒక 70 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని మెస్సి ఆవిష్కరించాల్సి ఉండగా కొన్ని సెక్యూరిటీ కారణాల ద్వారా ఆ ప్రోగ్రాంను వర్చువల్ గా నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇలా 15వ తేదీ సాయంత్రమే అతను తిరిగి మళ్లీ పయనం అవుతారు అని అధికారులు తెలిపారు. ఇప్పటికే మెస్సి రాకతో ఆయా రాష్ట్రాల అధికారులు అని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.

Read also : అఖండ-2 ఎఫెక్ట్.. పలు సినిమాలకు భారీ ఎదురుదెబ్బ!

Read also : తెలంగాణకు IMD అలర్ట్.. మరో రెండు రోజులపాటు తీవ్రమైన చలి!

Back to top button