క్రైమ్

కౌన్సిలర్‌ను చంపిన భర్త - వివాహేతర సంబంధమే కారణం?

  • కత్తితో దాడి చేసి దారుణహత్య

  • చెన్నై గోమతిలో ఘటన

క్రైమ్ మిర్రర్, చెన్నై : చెన్నై శివారులోని తిరునాన్రిపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కౌన్సిలర్‌ను సొంత భర్తే నడిరోడ్డుపై కత్తితో నరికిచంపాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే తిరునిండ్రావూర్‌ మున్సిపాలిటీ 26వ వార్డు కౌన్సిలర్‌ ఎస్‌.గోమతిని ఆమె భర్త స్టీఫెన్ రాజ్ కత్తితో దాడి చేసి చంపాడు. రోడ్డుపై వేరే వ్యక్తితో మాట్లాడుతున్న సమయంలో గోమతిపై స్టీఫెన్‌ రాజు దాడికి తెగబడ్డాడు. తీవ్రగాయాలతో గోమతి అక్కడికక్కడే మరణించింది.

Also Read : కాపు కాసి కమ్మ కత్తితో అత్తను నరికి చంపిన అల్లుడు

హత్య అనంతరం స్టీఫెన్‌ రాజ్‌ నేరుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. అయితే ఈ దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇతరులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని స్టీఫెన్‌ రాజ్‌ కక్ష పెంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. గోమతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. హత్య ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. గోమతి హత్యతో అటు కుటుంబంలో, ఇటు మున్సిపాలిటీలో తీవ్ర విషాదం నెలకొంది.

Back to top button