జాతీయం

Delhi Blasts: ఢిల్లీ బాంబు పేలుడు ముందు ఏం జరిగిందంటే? వెలుగులోకి షాకింగ్ వీడియో!

ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పేలుడుకు ముందు నిందితుడు డా. ఉమర్ హర్యానాలో అద్దెకు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.

Delhi Car Blasts Case: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగి కారు బాంబుదాడి నిందితుడిని దర్యాప్తు బృందాలు డాక్టర్. ఉమర్ మొహమ్మద్ గా గుర్తించారు. అతడి గురించి ఆరా తీస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బాంబు దాడికి ముందు పది రోజుల పాటు ఉగ్రవాది ఉమర్ హర్యానాలోని నూహ్ జిల్లాలో ఓ అద్దె ఇంట్లో ఉన్నట్టు తేలింది.  గుర్తించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని బయటపెట్టారు.

కారు బ్లాస్ట్ లోనే ఉమర్ హతం

ఢిల్లీలో పేలుడు పదార్థాలు ఉన్న కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన డా. ఉమర్ ఈ దాడికి తెగించాడు. ఈ ఘటనలో అతడు కూడా హతమయ్యాడు. అయితే, ఈ దాడికి ముందు అతడు ఎక్కడెక్కడ తిరిగాడు? ఏం చేశాడు? అనేది తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా దాడి ముందు పది రోజుల పాటు అతడు హర్యానాలోని నూహ్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. స్థానికంగా ఓ కాలనీలో అద్దె ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఘటన జరిగిన రోజున అతడు దాడి కోసం రెడీ చేసుకున్న కారులో నూహ్ నుంచి బయలుదేరాడు. నూహ్ లో ఉన్న ఓ డయాగ్నస్టిక్ సెంటర్ సీసీటీవీ కెమెరాల్లో మొహమ్మద్ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం రికార్డయ్యింది. అయితే, అతడు ఏ మార్గంలో ఢిల్లీకి చేరుకున్నాడనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు పేలుడుకు ముందు అతడు నూహ్ జిల్లాలోనే ఉన్నట్టు సీసీటీవీ కెమెరా ఫుటేజీలో స్పష్టమైంది. ఫిరోజ్‌ పూర్ ఝిర్ఖా దగ్గర అతడు రోడ్డు దాటుతున్నప్పుడు, ఏటీఎమ్ దగ్గర డబ్బులు విత్‌డ్రా చేస్తున్నప్పుడు అతడు సీసీ కెమెరాకు చిక్కాడు.  మోబైల్ షాప్ లో ఏదో కొనుగోలు చేస్తున్నట్లు కనిపించింది.

ఉమర్ సహోద్యోగులు అరెస్ట్

అటు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో డా. ఉమర్ సహోద్యోగులు అయిన డా. షహీన్ సయీద్, డా. ముజమ్మిల్ షకీల్, డా.అదిల్ రథార్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులు ఉంటున్న ఇళ్ల నుంచి పోలీసులు ఇప్పటివరకూ 3 వేల కిలోల బాంబు తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో, దేశవ్యాప్తంగా భారీ కుట్రకు నిందితులు ప్లాన్ చేసే ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Back to top button