జాతీయంసినిమా

మరికాసేపట్లో గ్లోబ్‌ట్రాటర్.. రాజమౌళి సాలిడ్ అప్‌డేట్ ఇదే..

రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే రాజమౌళి-మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది.

రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే రాజమౌళి-మహేశ్ బాబు సినిమాకు సంబంధించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ఈ వేడుకలో ఏం ఉండబోతుందో దర్శకుడు రాజమౌళి స్వయంగా సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. టైటిల్‌తో పాటు సినిమాలోని ఫిక్షనల్ ప్రపంచాన్ని చూపించే ప్రత్యేక విజువల్స్‌ను ఈ ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 100 అడుగుల భారీ తెరపై మొదట అనౌన్స్‌మెంట్ వీడియోను ప్రదర్శించి, అనంతరం ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు కూడా తెలిపారు.

ఈ సమాచారంతో మహేశ్ బాబు అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటికే వేలాదిగా అభిమానులు రామోజీ ఫిల్మ్ సిటీలో చేరి వేడుక కోసం ఆత్రుతగా వేచి ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈవెంట్ ప్రారంభం కానుండగా, సినిమా టైటిల్ ఏమై ఉంటుందో, గ్లింప్స్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి శిఖరాలకు చేరుకుంది.

ALSO READ: White Hair: మీ తెల్ల జుట్టు నల్లగా మారాలా..? అయితే ఇలా చేయండి

Back to top button