అంతర్జాతీయం

Sydney Shooting: ఆ ఉగ్రవాదులు పాకిస్థానీలే.. వెల్లడించిన ఆస్ట్రేలియా!

సిడ్నీలో యూదులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు ఇద్దరూ తండ్రీ కొడుకులను ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. వారిద్దరు పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తులుగా గుర్తించారు.

Bondi Beach shooting updates: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు స్వయానా తండ్రీ కొడుకులని తేలింది. బోండీ బీచ్‌లో హన్నుకా వేడుకల్లో పాల్గొన్న యూదులపై జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించిన దుర్మరణం చెందారు. ఈ కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగులు సాజిద్‌ అక్రమ్‌, నవీద్‌ అక్రమ్‌ అని.. వీరు తండ్రీ కొడుకులు అని న్యూసౌత్‌వేల్స్‌ పోలీస్‌ కమిషనర్‌ మల్‌ లాన్యోన్‌ సోమవారం వెల్లడించారు.

పాకిస్తాన్ మూలాలున్న ఉగ్రవాదులు

ఇక ఈ కాల్పలుకు పాల్పడిన ఇద్దరికి పాకిస్తాన్ మూలాలున్నాయని సిడ్నీ పోలీసులు తెలిపారు. సాజిద్‌ అక్రమ్‌ 1998లో పాకిస్థాన్‌ నుంచి విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు ఆస్ట్రేలియా హోంమంత్రి టోనీ బర్కీ వివరించారు. నవీద్‌ అక్రమ్‌ ఆస్ట్రేలియాలోనే జన్మించాడు. సాజిద్‌ స్థానికంగా పండ్ల దుకాణం నడుపుతున్నాడని తెలిపారు. ఈ తండ్రీ కొడుకుల కాల్పుల్లో ఘటనా స్థలంలోనే 12 మంది మరణించగా, గాయపడిన మరో ముగ్గురు ఆ తర్వాత మరణించగటంతో మృతుల సంఖ్య 15కు పెరిగింది. పోలీసుల కాల్పుల్లో సాజిద్‌ కూడా మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 16 అయ్యింది. 1996లో పోర్ట్‌ ఆర్థర్‌లో పర్యాటకులపై ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని పోలీసులు వెల్లడించారు.

నవీద్ ను గతంలోనే అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఉగ్రవాది నవీద్‌ను ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిగా అనుమానించి 2019లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభించకపోవటంతో వదిలేసి, అతడిపై సాధారణ నిఘా పెట్టారు. దీంతో ఇన్నాళ్లు మంచివాడిగా నటించిన అతడు.. సమయం చూసి ఘాతుకానికి పాల్పడ్డాడు. యూదులు 8 రోజులపాటు నిర్వహించుకునే హన్నుకా వేడుకల చివరి రోజు ఛనుకా వేడుక సందర్భంగా బీచ్‌లోని ఓ పార్కులో దాదాపు 1,000 మంది పాల్గొన్నారు. ఇదే అదనుగా తండ్రీ కొడుకులు కాల్పులకు తెగబడ్డారు. సాజిద్‌ పదేళ్ల క్రితమే గన్‌ లైసెన్స్‌ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం నవీద్ ను పోలీసులు విచారిస్తున్నారు.

Back to top button