జాతీయం

Bomb Blast: జమ్మూకాశ్మీర్ లో భారీ పేలుడు.. ఆరుగురు స్పాట్ డెడ్!

Nowgam Police Station Blast: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో భారీ బాంబ్ బ్లాస్ జరిగింది. అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సహాయక సిబ్బంది  సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. నౌగామ్ పోలీస్ స్టేషన్ లో ఈ  పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ తీవ్రతకు పలువురి మృతదేహాలు ముక్కలు ముక్కలయ్యాయి. పోలీస్ స్టేషన్‌లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

బ్లాస్ట్ కు కారణం ఆ పేలుడు పదార్థాలేనా?

ఫరీదాబాద్‌ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను  నిపుణులు పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిల్వ ఉంచిన అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలు పేలి ఈ ఘోరం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.  ఫరీదాబాద్‌ ప్రాంతం స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలోని రసాయన పదార్థాల నమూనాలను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు,  పోలీసు అధికారులు కలిసి పరీక్షలు ప్రారంభించిన సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ ఉగ్రదాడి దర్యాప్తులో నౌగామ్ పోలీసుల కీలక పాత్ర   

ఢిల్లీ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా జరుగుతున్న దర్యాప్తులో నౌగామ్‌ పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉగ్రవాద నెట్‌ వర్క్‌ ను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఘటనలో ఆ కేసు విచారణ జరపుతున్న కీలక అధికారులు చనిపోయినట్లు తెలుస్తోంది.

Back to top button