క్రైమ్

MLA Arrest: మూడోసారి అత్యాచార కేసు నమోదు, తెల్లవారు జామున ఆ ఎమ్మెల్యే అరెస్ట్!

పదే పదే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయనపై రెండు అత్యాచారా కేసులు నమోదు కాగా, తాజాగా మరో యువతి కేసు పెట్టింది.

కేరళలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌ అరెస్ట్ అయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున పాలక్కాడ్‌లోని కేపీఎం రీజెన్సీ హోటల్ నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. త్వరలో రాహుల్‌ను మేజిస్ట్రేట్ మందు హాజరు పరుస్తామని తెలిపారు. కెనడాలో పనిచేస్తున్న పతనంతిట్టకు చెందిన ఓ యువతి మామ్‌కుటత్తిల్‌పై అత్యాచార ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గతంలోనూ సదరు ఎమ్మెల్యేపై అత్యాచార కేసులు

రాహుల్ మామ్‌కుటత్తిల్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ గతంలో ఓ నటి సహా మరో యువతి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఎమ్మెల్యేపై అత్యాచార సంబంధిత కేసులు నమోదయ్యాయి. ఆ కేసులపై మామ్‌కుటత్తిల్ ముందస్తు బెయిల్‌ పొందారు. అయితే.. తాజాగా మరో యువతి కూడా అతడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆరోపించింది. అంతేకాకుండా.. తన గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరించాడని కూడా ఆమె పేర్కొంది. రాజకీయంగా అతడికి పలుకుబడి ఉండటంతో ఇన్నాళ్లూ పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని ఆమె వాపోయింది. అయితే.. ఆ ఎమ్మెల్యేపై అత్యాచార కేసులు నమోదయ్యాయని తెలియడంతో.. తానూ ఫిర్యాదు చేసినట్టు స్పష్టం చేసిందామె. దీంతో పరారీలో ఉన్న బహిష్కృత ఎమ్మెల్యే  మామ్‌కుటత్తిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాహుల్ ను పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్

అటు రాహుల్ పై పదే పదే అత్యాచార ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ బహిష్కృత నేతగా కొనసాగుతున్నారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు రాహుల్ మీద చర్యలకు దిగారు. అందులో భాగంగానే అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button