క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖర్ రాజు హెచ్చరించారు. మంగళవారం రాత్రి 10 గంటలకు చైతన్యనగర్ బోటింగ్ పార్కు, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహన చోదకుల మద్యం సేవన పరీక్షలు (డ్రంక్ అండ్ డ్రైవ్), గంజాయి దొంగరవాణా నిరోధక చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా, యువతకు కౌన్సెలింగ్ నిర్వహించి, ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. దాడుల సమయంలో 21 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.ఈ తనిఖీల్లో వన్ టౌన్, టూ టౌన్, రూరల్ ఇన్స్పెక్టర్లు మొతిరాం, సోమనర్సయ్య, పీఎన్‌డీ ప్రసాద్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖర్ రాజు హెచ్చరించారు. మంగళవారం రాత్రి 10 గంటలకు చైతన్యనగర్ బోటింగ్ పార్కు, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహన చోదకుల మద్యం సేవన పరీక్షలు (డ్రంక్ అండ్ డ్రైవ్), గంజాయి దొంగరవాణా నిరోధక చర్యలు చేపట్టారు.