ఆంధ్ర ప్రదేశ్

అది మీ తెలివి తక్కువ తనం.. పవన్ పై రెచ్చిపోయిన సత్యరాజ్!

actor sathyaraj warning to ap dy cm pawan kalyan

Sathyaraj Warning: సీనియర్ నటుడు, కట్టప్పగా గుర్తింపు తెచ్చుకున్న సత్యరాజ్.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. మతం పేరుతో ఓట్లు దండుకోవాలనే కుట్రలు తమిళ గడ్డ మీద పారవని తేల్చి చెప్పారు. తాజాగా తమిళనాడులోని మధురైలో జరగిన మురుగన్ మానాడు సభకు హాజరైన పవన్ కల్యాణ్.. నాస్తికులు, సెక్యులరిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సత్యారాజ్ పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మధురై సభలో డీఎంకేను టార్గెట్ చేసిన పవన్

మధురైలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ నేరుగా అధికార డీఎంకేను టార్గెట్ చేశారు. హిందువులు, సనాతన ధర్మం గురించి ప్రస్తావించారు. నాస్తికులు ఏ దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదని, కానీ, అదే నాస్తికులు హిందువులను ఎంపిక చేసుకుని మరీ టార్గెట్ చేస్తున్నరాని విమర్శించారు. హిందువులను టార్గెట్ చేయడం, వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని పవన్ హెచ్చరించారు. అయితే, పవన్ కల్యాణ్ మతం పేరుతో తమిళనాడులో చిచ్చు పెట్టాలని చూస్తున్నడంటూ పలువురు డీఎంకే మంత్రులు ఆరోపించారు.

Read Also: ఈ నెల 30 వరకు వానలే వానలు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!

తమిళనాడులో మీ ఆటలు సాగవు

తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సత్యరాజ్ స్పందించారు. దేవుడి పేరుతో తమిళనాడులు రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను మోసం చేయలేరన్నారు. మురుగన్ సభతో తమిళ ప్రజలను మోసం చేయాలనుకుంటే తెలివి తక్కువ తనం అవుతుందన్నారు. తమిళ ప్రజలు చాలా తెలివైన వాళ్లని చెప్పిన సత్యారాజ్.. ఇక్కడ మీ ఆటలు సాగవంటూ ఘాటు విమర్శలు చేశారు.

Read Also: మూడు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు.. హైకోర్టు సంచలన తీర్పు

Back to top button