జాతీయం

విమానంలో మంటలు, లోపల 250 మంది ప్రయాణీకులు!

Saudi Hajj Flight: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మర్చిపోక ముందే మరో విమానానికి మంటలు అంటుకున్నాయి. హజ్ యాత్రికులతో లక్నో ఎయిర్ పోర్టుకు వచ్చిన సౌదీ అరేబియా విమానానికి తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. 250 మంది హజ్ ప్రయాణీకులతో జెడ్డా నుంచి బయల్దేరిన సౌదీ ఎయిర్ లైన్స్ విమానం లక్నోలోని అమౌసి విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత టాక్సీ రూట్ లో వెళ్తుండగా, విమానం ఎడమ టైర్ కు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి.  వెంటనే అలర్ట్ అయిన విమాన పైలెట్ ఏటీసీకి సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు సుమారు అరగంటపాటు శ్రమించి మంటలు ఆర్పారు. అనంతరం ప్రయాణీకులను సురక్షితంగా కిందికి దింపారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?

సౌదీ అరేబియా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన ఫ్లైట్ రాత్రి 11:30 గంటలకు సౌదీలోని జెడ్డా విమానాశ్రయం నుంచి బయల్దేరింది. ఈ విమానంలో 250 మంది హజ్ యాత్రికులు ఉన్నారు. ఉదయం 6:30 గంటల సమయంలో లక్నోకు చేరుకుంది. అమౌసి విమానాశ్రయంలో రన్ వే మీద దిగింది. టాక్సీవే పైకి వస్తుండగా, దానికి ఎడమ చక్రం నుంచి మంటలు, పొగలు వచ్చాయి. ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. గమనించిన పైలెట్ ఏటీసీకి చెప్పాడు.  వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక బృందాలు దాదాపు 20 నిమిషాలు కష్టపడి మంటలు ఆర్పింది. ఆ తర్వాత ప్రయాణీకులను సురక్షితంగా కిందికి దింపారు. సాంకేతికలోపం కారణంగా విమానం రన్‌ వే మీద ల్యాండ్ అవుతుండగా, లెఫ్ట్ టైర్ పని చేయలేదు. ఈ నేపథ్యంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు వెల్లడించారు.

Read Also: షార్ కు బాంబు బెదిరింపు.. నిఘా నీడలో శ్రీహరికోట!

Back to top button