- నేడు సాయంత్రం 5 గంటలకు మంత్రుల రాక…
- కళ్యాణంలో పాల్గొన్న 200 దంపతులు
- భారీగా తరలివచ్చిన భక్తులు..
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో శుక్రవారం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేకువజామునే వివిధ రకాల పుష్పాలతో వేద పండితులు సతీష్ శర్మ, మణిశర్మ సూర్య కుమార్ స్వామి వారికి అలంకరణ చేశారు. దేవాలయ కమిటీ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు అశోక కుమారి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణానికి 200 మందికి పైగా జంటలు కళ్యాణంలో పాల్గొనారు. పరిసర ప్రాంతాలంతా శివనామ స్మరణంతో మార్మోగాయి కళ్యాణం లో పాల్గొన్న గంటలకు దేవాలయ కమిటీ చైర్మన్ సన్మానించారు. అనంతరం భక్తులకు వాటర్ ప్యాకెట్లు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు.
నేడు రానున్న మంత్రులు…
కాకతీయ కాలం నుండి ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతరకు మంత్రులు రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పౌరసరపరాల ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి జాతర సంస్కృతి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు శ్రీ రామలింగేశ్వర దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతర క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేయనున్నారు. కాగా కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చైర్మన్ కోరారు.