సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యమ జర్నలిస్టుల వార్నింగ్

అసెంబ్లీ సాక్షిగా జర్నలిస్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్జి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న జర్నలిస్ట్ సంఘాలు.. ఉద్యమానికి సిద్ధమవుతున్నయి. సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక(TUJV)
హెచ్చరించింది.

తెలంగాణ శాసనసభలో రేవంత్ రెడ్డి జర్నలిస్టులను, జర్నలిజాన్ని దారుణమైన బాషతో దూషించడాన్ని తప్పుబట్టింది తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక. మీమీ రాజకీయాలను మొత్తం జర్నలిజానికి అపాదించాలనుకోవడం ఆక్షేపణీయమని తెలిపింది. స్పీకర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే రికార్డుల నుంచి తొలగించి ఉండాల్సిందని.. ఇప్పటికైనా తొలగించాలని కోరింది. తెలంగాణ జర్నలిస్టులు కడుపుమాడ్చుకొని ఉద్యమానికి ఊపిరిపోస్తేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని.. ఈ విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి గౌరవాన్ని నిలబెట్టుకోవాలని.. లేదంటే తదుపరి ఉద్యమ కార్యాచరణను తీసుకుంటామని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల వేదిక(TUJV) ప్రకటించింది.

అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. యూట్యూబర్లను తీవ్రంగా అవమానించారు. యూట్యూబ్ జర్నలిస్టులను క్రిమినల్స్ కింద చూస్తామన్నారు. వాళ్ళను బట్టలు, గుడ్డలు ఊడతీసి కొడతానని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Exit mobile version