జాతీయంలైఫ్ స్టైల్

Lifestyle: ఆరోగ్యమే ఫస్ట్.. ఎంజాయ్‌మెంట్ నెక్ట్స్

Lifestyle: యువతలో ఒకప్పుడు వీకెండ్ అంటే పబ్బులు, పార్టీలు, నైట్ అవుట్‌లు, ట్రిప్పులే అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఈ తరానికి చెందిన Gen Z ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది.

Lifestyle: యువతలో ఒకప్పుడు వీకెండ్ అంటే పబ్బులు, పార్టీలు, నైట్ అవుట్‌లు, ట్రిప్పులే అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఈ తరానికి చెందిన Gen Z ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది. గాలప్, మానిటరింగ్ ది ఫ్యూచర్ అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఫ్రీటైమ్ దొరికితే ఎంజాయ్ కోసం ఆల్కహాల్‌ లేదా రాత్రంతా బయట తిరగడం కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే మార్గాలను ఎంచుకోవడమే యువతకు ఇష్టం అవుతోంది. డ్రింక్స్‌కు బదులు ప్రోటీన్ షేక్స్, నైట్ అవుట్‌లకు బదులు మార్నింగ్ రన్స్ వంటి ఆరోగ్యకరమైన రొటీన్‌లకు వారు ప్రాధాన్యం ఇస్తున్నారు.

1997 నుండి 2012 మధ్య జన్మించిన Gen Z యువత ఈ మార్పును మరింత వేగంగా స్వీకరిస్తోంది. వీకెండ్స్ అనగానే పబ్బులు, ఆల్కహాల్ పార్టీలు ముందుగా గుర్తొచ్చిన రోజులు పోయాయి. ఇప్పుడు ఫిట్‌నెస్‌, మానసిక శ్రేయస్సు, సమతుల్య జీవితమే వారికి ముఖ్యం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వాడకం యువతలో తగ్గుముఖం పడుతుండగా, ఇప్సోస్ సర్వే ప్రకారం.. 18 నుండి 34 ఏళ్ల వయస్సులో ఉన్న వారిలో సగం మంది ఇకపై తక్కువ తాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పాత తరాలకంటే ఆరోగ్యాన్ని ముందుగా పెట్టుకునే తరం ఇదేనని నిపుణులు చెబుతున్నారు.

ఏబీసీ ఫిట్‌నెస్ డేటా ప్రకారం.. జెన్ Z యువకుల్లో 73 శాతం మంది రెగ్యులర్‌గా జిమ్‌, యోగా సెంటర్లు, హెల్త్ క్లబ్బులకు వెళ్లి వ్యాయామం చేస్తున్నారు. అలాగే, మరొక సర్వేలో 57 శాతం యువత బార్‌లో ఒక గంట గడిపే బదులు జిమ్‌లో వర్కౌట్ చేయడాన్నే ఇష్టపడుతున్నట్లు తెలిసింది. ఈ మార్పు కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాకుండా, జీవన శైలిని పూర్తిగా మార్చుతున్న సానుకూల ఆలోచనగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు వంటి అంశాలకు దూరంగా ఉండటానికి యువత ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకోవడం వారికి మానసిక ప్రశాంతతను ఇస్తోంది. వ్యాయామం, మంచి నిద్ర, స్వచ్ఛమైన జీవన విధానం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటి విషయాలు రోజువారీ జీవితంలో ముఖ్య స్థానాన్ని దక్కించుకుంటున్నాయి. ఈ మార్పుతో సరికొత్త జీవనశైలి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ALSO READ: Telangana excise: డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం షాపులు ప్రారంభం

Back to top button