
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్:- యూఎస్ బైడెన్ చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్ అంటూ డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ట్రంప్ వివాదాస్పద పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. ఓపెన్ బోర్డర్ రూపంలో బైడెన్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా కొన్ని లక్షల మంది క్రిమినల్స్ ను అమెరికాలోకి రాణించారని ట్రంప్ తీవ్రంగా ఆరోపించారు. ఓపెన్ బోర్డర్ రూపంలో వచ్చిన వారిలో అత్యధికంగా హంతకులు, డ్రగ్ డీలర్స్ అలాగే పిచ్చాసుపత్రి నుంచి వచ్చిన వారే చాలామంది ఉన్నారు అని అన్నారు. వీళ్ళందర్నీ కూడా దేశం నుంచి వెళ్ళగొట్టడమే నా లక్ష్యమని డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అందుకే ఈ ఎలక్షన్లలో నన్ను ప్రజలు ఎన్నుకున్నారని చెప్పుకొచ్చారు. బైడెన్ యూఎస్ చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్ అని ట్రంప్ అనడంలో చాలామంది నుంచి చర్చలు మొదలయ్యాయి. మరి ముందు ముందు బైడెన్ గురించి డోనాల్డ్ ట్రంప్ ఏమంటారో వేచి చూడాల్సిందే.
కాంగ్రెస్ ,బిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం!.. పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
కోమటిరెడ్డిపై జానారెడ్డి రాజకీయం… రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవికి జానా ఎర్త్..!