ఆంధ్ర ప్రదేశ్
Trending

పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పాలి: నారా లోకేష్

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా కలిసి మన సంస్కృతి మరియు సంప్రదాయాలను కాపాడుకోవాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలియాలకు ప్రభుత్వం తరఫున సహాయం అందజేస్తున్నామని అన్నారు. టెక్నాలజీ ఆధారంగా ఆధ్యాత్మిక సేవలను ఆదర్శంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా సమాజాన్ని నడిపించేది ఆ దేవదేవుడు మాత్రమే అని అన్నారు. కాబట్టి పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండా మన పురాణాలు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు, శ్రీ మహావిష్ణువు గురించి ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేలా చెప్పాలని అన్నారు. తాజాగా టెంపుల్స్ ఎక్స్ పో సదస్సులో నారా లోకేష్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దక్షిణాది రాష్ట్రాల్లోని దేవాలయాలలో పర్యటిస్తూ సనాతన ధర్మం గురించి తెలియజేస్తున్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మాన్ని వివరించి చెప్పాలని అన్నారు. కాబట్టి అన్ని దేవాలయాలకు పర్యటించి పురాణాలు తెలుసుకోవాలని అన్నారు. ఇంకా మహాభారతం, రామాయణం కూడా చిన్నప్పటినుంచి ఏ పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి
1.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది!… 100% అధికారంలోకి నేనే వస్తా : KCR

2. బాధితునిపై మద్దూర్ ఎస్సై దాడి… పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేసిన పలు సంఘాల నాయకులు!

3. మహా కుంభమేళాలో దర్శనం ఇచ్చిన పవన్ కళ్యాణ్!..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button