తెలంగాణ

AI అంటే అనుముల ఇంటెలిజెన్స్.. కవిత సంచలన వ్యాఖ్యలు

ఎఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ దోమలగుడలోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో తెలంగాణ జాగృతి, యూనైటెడ్‌ పూలే ఫ్రంట్‌ సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన పులే విగ్రహ సాధన దీక్షను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టారు.1116 మంది ఈ దీక్ష చేపట్టారు… అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని,అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదన్నారు.

దేశంలోని ప్రతి ఆడబిడ్డ జ్యోతి రావు పులేను స్మరించు కోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. తమకు స్వలాభం లేదని, కాంగ్రెస్ ను వినమ్రంగా అడుగుతున్నామని ఆమె అన్నారు. 11వ తేదీ వరకు విగ్రహ ఏర్పాటు ప్రకటన చేయాలని, బిసి రిజర్వేషన్ బిల్లు చట్టసభలో ఆమోదించి నాలుగు వారాలైందని చెప్పారు. ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని..బిల్లు ఎక్కడుందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెలతామన్నారు.. కాని బిజెపిని కాపాడడానికి ఆ బిల్లును కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి పంపలేదని ఆమె విమర్శించారు.ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తుపేల్ ధర్నా చేశారని, మీలా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయమన్నారు…
అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని కవిత స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి .. 

  1. మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించిన మనోజ్… భారీగా పోలీసు బందోబస్తు!.. ఏం జరుగుతోంది?

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button