
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- నందమూరి బాలకృష్ణ అభిమానులు అంటే కేవలం చిన్నపిల్లలు మాత్రమే అనుకునేరు. బాలకృష్ణకు అభిమానులు చిన్నపిల్లలే కాదు.. పెద్దలు కూడా కాదు.. ఎమ్మెల్యేలు కూడా ఉంటారు అని తాజాగా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నిరూపించారు. నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ-2 సినిమా టికెట్ ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఏకంగా 5 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. బాలకృష్ణ అంటే నాకు ఎంతో ఇష్టం అని.. బాలకృష్ణ పై ఉన్న అభిమానంతోనే ఇంత ధర పెట్టి టికెట్ కొనుగోలు చేశాను అని ఎమ్మెల్యే జగన్మోహన్ తెలిపారు. నేడు బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యే జగన్మోహన్ ను కలిసి అఖండ 2 సినిమా టికెట్ ను అందజేశారు. ఒక బాలకృష్ణ అభిమానిగా అతను నటించేటువంటి ప్రతి సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. బాలకృష్ణ నటించిన ప్రతి సినిమా కూడా విజయవంతం కావాలని ప్రతిసారి ఇలానే దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాను అని ఎమ్మెల్యే జగన్ మోహన్ తెలిపారు. అయితే ఇప్పటివరకు యువత అలాగే వృద్ధులు బాలకృష్ణపై అభిమానం చూపిస్తూ ఉండగా తాజాగా ఎమ్మెల్యేలు సైతం మేము కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అని నిరూపిస్తున్నారు. ఇక ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలు కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రతి ఒకరిని కూడా థియేటర్లకు రప్పించే విధంగా ఉంది. కాగా ఈ సినిమా ప్రీమియర్ షోలు రద్దు చేసిన విషయం తెలిసిందే.
Read also : మహా పాపం జగన్.. అది చిన్న చోరీ ఏంటి?
Read also : మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వండి.. తెలుగు వస్తేనే ఉద్యోగం ఇవ్వండి : మాజీ ఉపరాష్ట్రపతి




