
క్రైమ్ మిర్రర్, జగిత్యాల :-  కోరుట్ల పట్టణానికి చెందిన రుద్ర వేణుగోపాల్ ఆదర్శనగర్, కోరుట్ల , పోచమ్మ వాడ లో మంత్ర ఆన్లైన్ సెంటర్ నడిపిస్తూ గత రెండు సంవత్సరాల నుండి ఫోటోషాప్ ద్వారా దొంగ సర్టిఫికెట్లు ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ మెమోలు మరియు నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ అవసరం ఉన్నవారికి వాటిని అమ్ముతూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు కోరుట్ల పోలీసులు మరియు  CCS పోలీస్ వారు  జాయింట్ గా నిందితుడి షాప్, మంత్ర ఆన్లైన్ సెంటర్ పైనా ఆకస్మిక  దాడి చేసి నిందితుడు వేణుగోపాల్ నీ పట్టుకొని  అతని వద్ద నుండి 106 నకిలీ సర్టిఫికెట్లు (10త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, Btech and experience, Birth, Death certificates)ఒక కంప్యూటర్ ఒక ప్రింటర్ పేపర్ కటింగ్ మిషన్ లామినేషన్ మిషన్ ఒక మానిటర్ స్వాధీన పరుచుకుని , అతని మీద కేసు నమోదుచేసి,నిందితున్ని రిమాండ్ కి తరలించనైనది.
రిషబ్ పంత్ కు గాయం… ఇక వీళ్ళపైనే అందరి ఆశ!
   నకిలీ సర్టిఫికేట్ల తయారు చేస్తున్న నిందితుని  అరెస్ట్  చేయడంలో కృషి చేసిన సీ.ఐ కోరుట్ల సురేష్ బాబు, CCS ఇన్స్పెక్టర్  M. శ్రీనివాస్ , SI కోరుట్ల  చిరంజీవి , SI CCS  కె. రాజు,  కానిస్టేబుల్ లు అఫ్రోజ్ , సాజిద్ ,  వినోద్, సురేష్, కమలాకర్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్  అభినందించారు.
ప్రముఖ యాంకర్ సుమ భర్తకు షాక్… నటుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసుల నోటీసులు
				
					
						




