ఆంధ్ర ప్రదేశ్

టిడిపి కార్యాలయం పై దాడులు చేయడం మా తప్పే: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో జరిగినటువంటి టిడిపి కార్యాలయం పై దాడి గురించి తాజాగా వైసీపీ నాయకుడు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం పై దాడి ముమ్మాటికి తప్పే అని అన్నారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ‘ వైకాపా ప్రభుత్వంలో టిడిపి కార్యాలయం పై జరిగిన దాడిని ఖండించారు. ప్రతిపక్ష నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అధికారంలో ఉన్న నాయకులు దాడులకు పాల్పడడం మంచిది కాదని అన్నారు. తాడిపత్రిలో మా చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేసినప్పుడు కూడా అది తప్పేనని నేను వాదించానని అన్నారు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయాలి లేదా చర్చించి పరిష్కరించుకోవాలి కానీ ఈ దాడులు చేసుకోవడం అనేది మంచి విధానం కాదని అన్నారు.

ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురయ్యో లేదా జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికో వారు దాడులకు పాల్పడి ఉంటారని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యల గురించి నాకు స్పష్టత తెలియదని అన్నారు. ఒకవేళ నిజంగా అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే పార్టీ అధిష్టానం కచ్చితంగా తప్పని చెప్పాలి. అలా చెప్పలేదు కాబట్టి చంద్రబాబును తన భార్యని అధికారంలో ఉన్న నాయకులు రాక్షసుల ప్రవర్తించారనే భావన ప్రజల్లోకి వెళ్లిందని , తద్వారానే ప్రజలలో వైసిపి పై చెడు అభిప్రాయం ఏర్పడిందని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు ను అరెస్ట్ చేయడం మరోవైపు పవన్ కళ్యాణ్ ను అనవసరంగా ఎమ్మెల్యేలు మంత్రులు తిట్టడం… ఇదంతా కూడా టిడిపి మరియు జనసేన నాయకులకు ఎన్నికలలో గెలవడానికి కలిసి వచ్చిందని అన్నారు. రాజకీయాలలో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ది ఓ ప్రత్యేక సక్సెస్ స్టోరీ అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా ధర్మవరం నియోజకవర్గంలో నిత్యం తెల్లవారుజామునే ప్రజల్లోకి వెళ్లి వాళ్ల యొక్క కష్టాలను తెలుసుకుని పరిష్కరించే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా 2024 ఎలక్షన్లలో ఓడిపోవడం సంచలనంగా మారింది.

మా అన్న చావుకి హైడ్రానే కారణం.. బిల్డర్లు సూసైడ్ చేసుకోవాల్సిందే!

శనివారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

Back to top button