
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : ప్రజా భవన్ లో మహాత్మ జ్యోతిరావు పూలే కు సర్పంచ్ ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆద్వర్యం లొ నివాళులు అర్పించారు అనంతరం ప్రణాళిక సంఘం ఛైర్మెన్ జి చిన్నారెడ్డి కి మరియు ఐఏఎస్ దివ్య మేడం గారలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలి అని వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రజాభవన్ ముందు అర్థనగ్న నిరసన తెలియజేయాగా పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అధ్యక్షుడు యాదయ్య గౌడ్ పై పోలీసులు దాడి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం లొ రాక్షస పాలన కొనసాగుతుంది శాంతియుత మార్గంలో నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఎప్పటికప్పుడు అరెస్టులు చేయడం తగదు అన్నాను ఇప్పటికీ చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటివరకు చనిపోయిన సర్పంచ్ల ప్రతి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి ఇప్పటివరకు జరిగిన ఆత్మహత్యలకు ప్రభుత్వ హత్యలు గానే భావిస్తున్నాం అని అన్నారు.
Also Read : మూడు రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు!..
రాష్ట్రంలో సర్పంచులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని పోరాడి వెనక్కి రావాల్సిన పెండింగ్ బిల్లులు వచ్చేవరకు అనునిత్యం సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు ఉంటాయని అన్నారు ఇప్పటికైనా సర్పంచ్లను శత్రువులుగా చూడకుండా కక్ష సాధింపు చర్యలు మానుకొని మాకు రావలసిన బకాయినిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, కేశ బోయిన మల్లయ్య, రాష్ట్ర జేఏసీ నాయకులు బొడ్డు నర్సింలు ,రవీందర్ మంగ నర్సింలు, దుర్గం నరేష్ యాదవ్ , తదితరుల పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
-
జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్..!
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
-
ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్