దర్శకులకు క్షమాపణలు!… త్వరలోనే షెడ్యూల్లో పాల్గొంటా?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన జిమ్ లో గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా గాయపడిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. రష్మిక మందన త్వరలో చేయబోయేటువంటి సినిమాల గురించి తాజాగా ఒక పోస్ట్ రూపంలో తెలియజేసింది.

సమంతకు మరో వ్యాధి!… చాలా ఫన్నీగా ఉందంటూ ట్వీట్?

నా గాయం ఎంత పెద్దదో నాకే తెలియదు. నేను కోలుకునేందుకు రోజులు లేదా నెలలు పడుతుందో నాకే తెలియదు అంటూ… త్వరలోనే నేను చేయబోయేటువంటి సికిందర్ మరియు కుబేర సెట్స్ లోకి అడుగు పెడతానని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా సినిమా త్వరగా చేయడానికి నావల్ల ఆలస్యం అవుతుందని కాబట్టి దర్శకులకు నా క్షమాపణలు అంటూ తెలిపింది. నేను త్వరగానే తిరిగి వచ్చి యాక్షన్ సీన్లను చేయడానికి నా వంతు ప్రయత్నిస్తానని అలాగే ఈలోపు అవసరమైతే ఏదో ఒక మూలన కూర్చొని అడ్వాన్స్ పనులు చేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో క్షణాల్లోని వైరల్ అవుతుంది.

పవన్ vs నాయుడు.. కూటమిలో రచ్చ

కాగా ఈ మధ్య జిం లో వర్కౌట్ చేస్తుండగా రష్మిక మందనకు గాయమయ్యింది. ఆ గాయం కారణంగానే రష్మిక మందన త్వరలో చేయబోయేటువంటి సినిమాలకు ఆలస్యం అవుతుంది. అయితే ఈమధ్య రష్మిక నటించినటువంటి పుష్ప2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ సినిమాలో రష్మిక యాక్టింగ్ అయితే ఇరగదీసిందనే చెప్పాలి. ఇక ఇంతలోనే వేరే సినిమాలకి నటించే క్రమంలో జిమ్లో వర్కౌట్ చేస్తుండగా గాయమైంది.

రాహుల్ గాంధీ సీరియస్.. రేవంత్ ఆస్ట్రేలియా టూర్ రద్దు!

Exit mobile version