తెలంగాణ
Trending

కెసిఆర్ రంగంలోకి దిగితే… రేవంత్ రెడ్డి అయితే ఏంటయ్యా : హరీష్ రావు

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్రంలోని ప్రతి నాయకుడు కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పై విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా బి ఆర్ ఎస్ మాజీమంత్రి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రంగంలోకి దిగితే సీఎం రేవంత్ రెడ్డి అసలు తట్టుకోలేడని హరీష్ రావు ఓ ఇంటర్వ్యూలో తాజాగా హెచ్చరించడం జరిగింది. త్వరలోనే కెసిఆర్ రంగంలోకి దిగబోతున్నారని అన్నారు. ఈ ఫిబ్రవరి నెల ఆఖరిలో రాష్ట్రంలో భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

అడవిలో తుపాకుల మోత!… 13 మంది మావోయిస్టుల మృతి?

ఒకసారి కెసిఆర్ మళ్లీ బయటకు వచ్చి రంగంలోకి దిగితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కాదు కదా ఎవరు కూడా తట్టుకోలేరని అన్నారు. కెసిఆర్ కచ్చితంగా ప్రజా క్షేత్రం లోకి వచ్చి ప్రజల కష్టసుఖాలను మళ్లీ తెలుసుకుంటారని హరీష్ రావు అన్నారు. కెసిఆర్ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టగానే మేమంతా కూడా ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని తెలిపారు. ప్రజలు కూడా రాష్ట్రంలో పాలన ఎలా ఉంది అని అర్థం చేసుకుంటున్నారని.. హరీష్ రావు తెలిపారు.

క్రైమ్ మిర్రర్ కథనానికి స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

బిజెపికి కలిసోచ్చిన చంద్రబాబు ప్రచారం!….. అత్యధిక మెజారిటీతో ముందంజ?

Back to top button