క్రైమ్తెలంగాణ

ఇంతకీ ఆ దొంగ ఎవరు..?

ఇప్పటికే 5గురిని విచారించిన పోలీసులు..!

  • చండూరులో ఓ ఇంట్లో జరిగిన భారీ ఛోరీ పై సర్వత్ర చర్చ

చండూరు, క్రైమ్ మిర్రర్: చండూరు మున్సిపాలిటీలో ఇటీవల ఓ మహిళ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు బీరువా తెరిచి 25 తులాల బంగారం 50 తులాల వెండి 70 వేల నగదును అపహరించారు. కాగా దొంగతనం బయటి నుంచి వచ్చిన వ్యక్తులు చేశారా? లేక ఇది తెలిసిన వారి పనేనా అనేది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే దొంగతనం పట్టపగలే జరిగింది. సబ్ రిజిస్టర్ కార్యానికి సమీపంలో మెయిన్ రోడ్డుపై వరుసగా ఉన్న ఐదు షటర్ భాగాలలో ఒక భాగంలో బాధితురాలి నివాసం ఉంటుంది. దొంగతనం పట్టపగలే జరిగింది. దొంగ వెనుక భాగం నుంచి ఇంట్లోకి జొరవడి బీరువా తీశాడు. అయితే ఇక్కడే పలు అనుమానాలకు తావిస్తుంది.

వెనుక నుంచి ఎత్తయిన గోడ ఉండడంతో దొంగతనం జరిగింది పట్టపగలు కావడంతో దొంగ గోడ ఎక్కి వచ్చే పరిస్థితి లేదు. దొంగ వరుసగా ఉన్న ఇళ్లపై నుంచి మెట్ల మార్గంలో కిందికి దిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పక్కాగా దొంగతనం చేశాడు అంటే అతనెవరో తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదుగురిని ఇప్పటికే పిలిచి విచారించినట్టు తెలిసింది. ఈ దొంగతనం వెనుక ఏమైనా మతలబ్ ఉండవచ్చా అని కూడా స్థానికంగా సర్వత్ర చర్చ జరుగుతోంది. పోలీసులు సైతం విచారణను ముమ్మరంగా చేపడుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. పోలీసులు నిజాని నిగ్గు తేల్చేందుకు తమదైన శైలిలో ఇంకా ముందుకు పొనున్నట్లు సమాచారం. అతి త్వరలోనే దొంగ ఎవరనేది పోలీసులు బట్టబయలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు చదవండి…

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

Back to top button