
క్రైమ్ మిర్రర్, చౌటుప్పల్:- ప్రభుత్వం విశ్వకర్మ వర్గానికి మరింత సహకారం అందించాలని విశ్వకర్మ మనుమయ సంఘం మండల కమిటీ అధ్యక్షులు పంతంగి మదనాచారి కోరారు. విశ్వకర్మలు తమ వృత్తులను కొనసాగించుకునేందుకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు ఋణ సదుపాయం, పింఛన్ల విధానం వంటివి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా సంఘ భవనంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాన్‌కు ప్రత్యేక పూజలు జరిపి సమాజ ఐక్యతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ గౌరవ అధ్యక్షులు శానకొండ రాజు చారి, ప్రధాన కార్యదర్శి పగిడోజు శశిభూషణ్ చారి, బొల్లోజు రవికుమార్, దాసోజు బిక్షమాచారి, పోలోజు శ్రీనివాస చారి, మండలోజు బిక్షమాచారి, దేవరకొండ నరసింహ, కొండోజు సతీష్ చారి తదితర విశ్వకర్మ నాయకులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం విశ్వకర్మలకు ఆర్థిక, సామాజిక పరిరక్షణ కల్పించే విధానాలు తీసుకురావాలని ఒకే స్వరంతో డిమాండ్ చేశారు.
Read also : వర్షాలకు ప్రజలు నానా తిప్పలు.. హైదరాబాదులో ఏంటి ఈ పరిస్థితి?
Read also : మిర్యాలగూడ ఎమ్మెల్యే డ్యామేజ్ కంట్రోల్.. రైతుల కోసం సీఎం రేవంత్ కు 2 కోట్ల చెక్