
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఏపీలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లాలోని సత్యవతి పేట వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా ఇందులో ఏకంగా నలుగురు ఎమ్మెల్యే బంధువులు మృతి చెందారు. మరో ఇద్దరు ఈ ప్రమాదంలోనే గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే… బాపట్ల ఎమ్మెల్యే అయినటువంటి నరేంద్ర వర్మ తన కుమారుడి సంగీత్ ఫంక్షన్ కు కర్లపాలెం గ్రామానికి చెందినటువంటి ఎమ్మెల్యే బంధువులను ఆహ్వానించారు. అయితే వీరందరూ కూడా సంగీత్ ఫంక్షన్ కి వెళ్లి ఆనందంగా గడిపి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బంధువులు ఉన్నటువంటి కారును గుర్తుతెలియని లారీ వచ్చి ఢీకొనడంతో ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారందరూ కూడా ఎమ్మెల్యే బంధువులు కావడం.. అది కూడా తన కొడుకు ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఈ ఘటన వైరల్ గా మారింది. మృతి చెందిన నలుగురు వ్యక్తులు కర్లపాలెం గ్రామానికి చెందిన పుష్పవతి(60), శ్రీనివాసరాజు(54), బలరామరాజు(65), లక్ష్మీ గా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాద సంఘటనను తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే అతని బంధువులందరూ కూడా కన్నీటిపర్యంతమయ్యారు.
Read also : ఆదివారం ఇండియాదే… ఎమోషనల్ అయిన ప్లేయర్స్!
Read also : అనుమానం పెనుభూతంగా మారింది.. వికారాబాద్ జిల్లాలో ఘోరం!





