తెలంగాణ

11 రోజులైనా దొరకని కార్మికులు.. టన్నెల్ లోనే రెస్క్యూ టీమ్స్

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం అధికారులు జాగిలాలతో అన్వేషిస్తున్నారు. కానీ వారి జాడను అవి కనిపెట్టలేకపోయాయి. దీంతో చిన్నపాటి జేసీబీలను లొపలికి పంపి అడ్డుగా ఉన్న మట్టి, బురదను బయటకు తోడివేయాలని భావిస్తున్నారు అధికారులు. మరోవైపు నీటి ఊట భారీ ఎత్తున వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది. రెండో కన్వేయర్‌ బెల్ట్‌ అందుబాటులోకి వస్తేనే పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

నిన్నటి నుంచి మరమ్మతుల తర్వాత ఒక కన్వేయర్‌ బెల్ట్‌ తిరిగి పనిచేస్తోంది. సొరంగంలో మట్టి తవ్వకంలో ఈ కన్వేయర్‌ బెల్ట్‌ అత్యంత కీలకంగా పని చేయనుంది. సొరంగం పైకప్పు కూలినప్పుడు ఈ బెల్ట్‌ పాడైపోయింది. దాంతో రెండు రోజులపాటు శ్రమించిన ఇంజినీర్లు ఎట్టకేలకు దానిని రీస్టార్ట్‌ చేశారు. బెల్ట్ సెట్ కావడంతో టన్నెల్‌లో బురద, మట్టి తొలగింపుతో పాటు సహాయక చర్యల్లో వేగం పెరగనుంది. రాడార్‌ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్‌ చేస్తుండగా.. ఐదుచోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో ఐదు మెత్తని భాగాలను గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది భావిస్తున్నారు

Back to top button