క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- గత మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ తో భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచి కొట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ తుఫాన్ కారణంగా చాలానే వ్యవసాయ పంటలకు నష్టం చేకూరింది. మూడు రోజులపాటు నిత్యం వర్షాలు కురవడంతో చాలానే రోడ్లు బ్లాక్ అయ్యాయి. భారీ వర్షాలకు వాగులు మరియు వంకలు పొంగి పోరడమే కాకుండా చాలా నివాస ప్రాంతాలు కూడా నీట మునిగాయి. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను ముందుగానే అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3000 రూపాయల నగదును కూడా అందజేశారు.
Read also : కొట్టుకుపోయిన హైదరాబాద్–శ్రీశైలం హైవే..!
అయితే నేడు తెలుగు రాష్ట్రాల్లో ఈ మొంథా తుఫాన్ తాజాగా బలహీనపడింది. దీంతో వర్షాలు అలాగే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఊపిరి తీసుకుని తిరిగి వారి నివాస ప్రాంతాలకు చేరుకుంటున్నారు. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి నివాస ప్రాంతాలకు వెళ్లే వారికి వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎవరైతే వరద ప్రభావితానికి గురయ్యారో వారందరూ కూడా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలి అని కోరారు. వ్యాధుల ముప్పు నుంచి బయటపడాలంటే కచ్చితంగా ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమయంలో జ్వరం బారిన పడిన వారు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని లేకపోతే వ్యాధులు మరింత వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.
Read also : విజయ్ కి ఎదురు దెబ్బ.. నష్టపరిహారపు 20 లక్షలు మాకొద్దు అంటున్న బాధితురాలు





