జాతీయం

పుష్ప పాటకు డ్యాన్స్ చేసిన కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్

కేజ్రీవాల్ కుమార్తె హర్షిత వివాహం తన స్నేహితుడు సంభవ్‌ జైన్‌తో రాత్రి ఘనంగా జరిగింది.

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డ్యాన్స్ చేశారు. పుష్ప-2 సినిమాలోని సూసేకి పాట హిందీ వెర్షన్ కు స్టెప్పులేశారు. తన కూతురు హర్షిత వివాహ వేడుకల్లో ఆయన సందడి చేశారు. ఈ వేడుకలో తన సతీమణి సునీతతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు. అలాగే పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా తన సతీమణితో కలిసి డ్యాన్స్‌లు చేశారు.పాటలు పాడి ఉర్రూతలూగించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో జరిగిన ఈ వేడుకకు పంజాబ్‌ సీఎంతోపాటు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ సీనియర్‌ నేతలు, అతికొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు.


Also Read : కూటమికే విశాఖ మేయర్ పీఠం.. ఎన్నికకు ముందే వైసీపీ అవుట్


కేజ్రీవాల్ కుమార్తె హర్షిత వివాహం తన స్నేహితుడు సంభవ్‌ జైన్‌తో రాత్రి ఘనంగా జరిగింది. సంభవ్‌ జైన్‌ ఐఐటీ దిల్లీ గ్రాడ్యుయేట్‌. ఇదే విద్యాసంస్థలో హర్షిత కూడా కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. చదువుకునే సమయంలో వీరిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత హర్షిత.. గురుగ్రామ్‌లోని ఓ కంపెనీలో అసోసియేట్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు. అటు సంభవ్‌ కూడా ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి ‘బసిల్‌ హెల్త్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి .. 

  1. సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు

  2. నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!

  3. అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్

  4. సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్

  5. ఏపీలో లిక్కర్‌ స్కామ్‌ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్‌ వైపుకా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button