తెలంగాణ

తెలంగాణ లో నేటి నుంచి వైన్స్ షాపులు బంద్.. బంద్!…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు జిల్లాలలో నేటి నుంచి మద్యం అమ్మకాలు అనేవి నిలిచిపోనున్నాయి. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తారీకు సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్స్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ షాపులు, స్టార్ హోటల్ లోని బార్లు, అలాగే కళ్ళు దుకాణాలు కూడా బంద్ కానున్నాయి.

హిందువుల దగ్గర మాత్రమే శివరాత్రి పూజా సామాగ్రి కొనండి : రాజాసింగ్

రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలలో ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుండి మద్యం దుకాణాలనేవి మూసి వేయబడునున్నాయి. కాబట్టి కేవలం ఈ జిల్లాలో మాత్రమే మద్యం దుకాణాలు మూసి వేయబడనున్నాయి. కాగా ఇప్పటికే గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసులు ఆయా జిల్లాలలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిబంధనలు అతిక్రమిస్తే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇవాల్టి నుంచి మద్యం దుకాణాలు బంద్ కావడంతో మందుబాబులు ఆయా మద్యం దుకాణాలకు క్యూ కడుతున్నారు. తాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా సెగ గాలులు తగులుతున్నాయి.

READ MORE

  1. జగన్‌.. ఇదేనా మీ సాంప్రదాయం- వైసీపీ తీరుపై ఏపీ స్పీకర్‌ ఫైర్‌

  2. చందిప్ప మరాటిగూడలో చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

  3. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన చండూరు సన్ షైన్ పాఠశాల విద్యార్థులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button