తెలంగాణ

సాహితీ మేఖల ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలు

సాహితీ మేఖల ఆధ్వర్యంలో దాశరథి శతజయంతి ఉత్సవాలు

చండూరు,క్రైమ్,మిర్రర్:
తెలంగాణ తాడిత, పీడిత ప్రజల పక్షాన నిలిచి,వారి సమస్యలను తన రచనల ద్వారా గొంతెత్తి చాటిన మహాకవి దాశరథని,జూలై 22 న దాశరథి జయంతి సందర్భంగా సాహితీ మేఖల పక్షాన శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి పున్న అంజయ్య, ప్రధాన వ్యవహర్త మంచుకొండ చినబిక్షమయ్య సంయుక్తంగా ప్రకటించారు. సోమవారం సాహితీ మేఖల వ్యవస్థాపకులు అంబడిపూడి వెంకటరత్నం గారి జయంతి సందర్భంగా చండూరులో ఆయన విగ్రహానికి దాశరథి చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. దాశరథికి సాహితీ మేఖలకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 1949లో దాశరథి అగ్నిధార పుస్తకం చండూరులో ఆవిష్కరించబడిందన్నారు. దాశరథికి సాహితీ మేఖలకున్న అనుబంధం మేరకు దాశరథి శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయులను గౌరవించడం సంస్థ ఆనవాయితీగా నిర్వహిస్తుందన్నారు. అనంతరం అరటి పండ్లను పంచారు. ఈ కార్యక్రమంలో చండూరు సాహితీ మేఖల ప్రధాన వ్యవహర్త మంచుకొండ చిన్న బిక్షమయ్య, కవి, రచయిత మద్దోజు సుధీర్ బాబు, తడకమళ్ళ శ్రీధర్, వెంకన్న, కటకం చిన్న, తాడిశెట్టి గంగాధర్, రావిరాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button