తెలంగాణ

తెలంగాణలో బీజేపీ భ్రష్టుపట్టిపోయింది… గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

  • తనకు బాస్‌లెవరూ లేరని రాజాసింగ్‌ స్పష్టం

  • అసెంబ్లీ సమావేశాల్లో స్వతంత్ర అభ్యర్థిగా పాల్గొంటా

  • ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడతా: రాజాసింగ్‌

  • ఇకపై నన్నెవరూ ఆపలేరు: ఎమ్మెల్యే రాజాసింగ్‌

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజాసింగ్‌ చేసిన కామెంట్స్‌ ఆసక్తిగొలుపుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో స్వతంత్ర అభ్యర్థిగా పాల్గొంటానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం తనకు లభించిందన్నారు. తనను ఎవరూ కట్టడి చేయడానికి అవకాశం లేదని అన్నారు. తెలంగాణలో కొందరు నేతల వైఖరి వల్ల బీజేపీ భ్రష్టుపట్టిపోయిందని రాజాసింగ్‌ మండిపడ్డారు. కొందరు దుర్మార్గుల వల్ల పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని, వారివల్లే తీవ్ర నష్టం చేకూరుతున్నా అధిష్ఠానం తాత్సారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also:

  1. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  2. జపాన్ కు చేరిన ప్రధాని మోడీ, టోక్యోలో ఘన స్వాగతం
Back to top button