కేంద్ర ప్రభుత్వం వృద్దులందరికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైతే 70 సంవత్సరాలు నిండి ఉంటారో వారందరికీ కూడా 5 లక్షల రూపాయల ఉచిత బీమాను అమలు చేయనున్నారు. ఇక 70 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం లో అర్హత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా అందుకు కావాల్సినటువంటి అర్హతలను కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
చీలిక దిశగా ఇండి కూటమి! కాంగ్రెస్ అవుట్.. కేసీఆర్, జగన్ ఇన్!
ఎవరైతే 70 ఏళ్లు నిండిన పురుషులు మరియు మహిళలు ఉంటారో వారు మాత్రమే ఈ పథకం కింద అర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ అర్హత పొందడం కోసం కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అని అన్నారు. ఆధార్ కార్డు కూడా కేవలం వయసును తెలుసుకోవడానికి మాత్రమే అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఆధార్ కార్డు ఉంటే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా పథకం అమలు అవుతుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఎటువంటి ఆదాయం మరియు వృత్తితో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ అందరికి వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.
ఫలించిన పవన్ కళ్యాణ్ కృషి… నాగబాబుకు కీలక పదవి?
ఈ పథకం దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా https://beneficiary.nha.gov.in/ పోర్టల్ ద్వారా పీఎంజేఏవై పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇక ఆండ్రాయిడ్ యూసర్లు ఎవరైతే ఉంటారో వారు నేరుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకంలో చేరిన వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ వయ వందన కార్డును కేంద్ర ప్రభుత్వం అందజేస్తారు. అలాగే వీటికి డిజిటల్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువమంది అర్హులైన వృద్ధులు ఉన్నా కానీ, వారంతా కూడా కలిసి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స అనేది పొందవచ్చు. మన దేశవ్యాప్తంగా 16,691 ప్రభుత్వాసుపత్రులు అలాగే 13,078 ప్రైవేట్ ఆస్పత్రులలో ఈ పథకం అమలు అవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.