జగన్ కు బర్త్డే విషెస్ చెప్పిన చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ తెలిపారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి” అంటూ చంద్రబాబు నాయుడు ఇవాళ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. మీకు చక్కటి ఆరోగ్యంతో పాటు సుదీర్ఘ జీవితం ఉండాలని కోరుకుంటున్నట్లుగా తాజాగా ట్విట్ చేశారు.

Read More : టీటీడీ వైకుంఠ ఏకాదశి టికెట్లు కావాలా..అయితే ఇలా చేయండి..

2019వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఏకంగా 151 సీట్లతో భారీ మెజార్టీతో గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా జరిగిన ఎన్నికలలో కూటమి ప్రభుత్వం 161 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. హోరా హోరీగా సాగిన ఎన్నికలలో మేమంటే మేము గెలుస్తామంటూ నియోజకవర్గ ఎమ్మెల్యే తో సహా పెద్దపెద్ద ముఖ్య నాయకులు కూడా సవాలు విసురుతూ ఎలక్షన్లలో నిలబడ్డారు. కాని చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది.

Read More : కేటీఆర్ ను ఇరికించాలని హరీష్ రావు ప్లాన్!

అయితే ప్రత్యర్థులుగా నడుచుకుంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఒకసారిగా జగన్మోహన్ రెడ్డికి, సీఎం చంద్రబాబు నాయుడు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేయడం అనేది ప్రస్తుతం రాజకీయంగా ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేయడంతో అటు వైసిపి లోను ఇటు టిడిపిలోనూ పెద్దగా చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి పెద్ద పెద్ద నాయకులు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. అర్ధరాత్రి 12 గంటలకు ఫ్యాన్స్ కూడా భారీగానే సెలబ్రేషన్స్ చేశారు.

Read More : జూ నుంచి తప్పించుకున్నా సింహం!… వార్తలో నిజమెంత?

Exit mobile version