
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :-అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. UPS కార్గో విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే హఠాత్తుగా కుప్పకూలి భారీగా పేలిపోయింది. సమీప ప్రాంతాల వరకు మంటలు ఎగసిపడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు. సంఘటనా స్థలానికి ఫైర్ యూనిట్లు, ఎమర్జెన్సీ సర్వీసులు భారీగా చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. టేకాఫ్ సమయంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై FAA, NTSB అధికారిక దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం ఆసుపత్రులు, పరిశ్రమలు, తయారీ కంపెనీలకు కీలక సరుకు రవాణా చేసే కార్గో విమాన సేవల భద్రతపై మళ్లీ చర్చను తెరపైకి తెచ్చింది. UPS నెట్‌వర్క్ అమెరికాలో అతిపెద్ద కార్గో లాజిస్టిక్ వ్యవస్థల్లో ఒకటి. ఈ ఘటనతో UPS లాజిస్టిక్ కార్యకలాపాలపై తాత్కాలిక అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమాన రవాణా రంగంపై ఈ ప్రమాదం తీవ్ర ప్రభావం చూపింది.
Read also : గల్లి గల్లీలో చెత్త ఉంది.. ఆ చెత్త నా కొడుకు వల్లే కదా : సీఎం రేవంత్
Read also : హైడ్రా పేరుతో ఇల్లు కూలుస్తున్నాడు.. ఇది బెదిరింపుల సర్కార్ : కేటీఆర్





