
ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా కొంతమందిపై అభ్యంతరాలు తెలిపేటువంటి రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి. ఈ మధ్యనే రాంగోపాల్ వర్మ “నేను పూర్తిగా మారిపోయాను అంటూ ఇకపై ఎప్పుడూ కూడా గతంలో ఉండను” అంటూ చెప్పుకొచ్చిన ఆర్జీవికి ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. తాజాగా రాంగోపాల్ వర్మ కు మూడు నెలల పాటు అంధెరి మేజిస్ట్రేట్ జైలు శిక్ష విధించింది. ప్రముఖ దర్శకుడు అయినటువంటి రాంగోపాల్ వర్మను దాదాపుగా ఏడేళ్ల క్రితం నాటి చెక్ బౌన్స్ కేసులో దోషగా తేల్చిన న్యాయస్థానం తాజాగా మూడు నెలల పాటు ఆర్జీవికి జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన న్యాయస్థానం నాన్ బీయిలబుల్ వారంటీ జారీ చేసింది.
ఇక వెంటనే ఫిర్యాదుదారుడికి మూడు లక్షల 72,000 నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తేల్చింది. ఆ డబ్బు కనుక చెల్లించ లేకపోతే కచ్చితంగా మరో మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక 2018లో రామ్ గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. మష్చింద్ర మిశ్రా తరుపున శ్రీ కంపెనీ ఈ కేసును దాఖలు చేయగా పలుమార్లు ఈ కేసు నుండి రాంగోపాల్ వర్మ బెయిల్ తెచ్చుకున్నారు. కానీ ఈసారి అదృష్టం రాంగోపాల్ వర్మ కి వరించలేదు.
ఇవి కూడా చదవండి
1.వ్యక్తిగత సమాచారంను సోషల్ మీడియాలో పెట్టకండి!.. పోలీసులు సీరియస్ వార్నింగ్?
2.స్పెషల్ కామెంట్ తో లోకేష్ ని ఆకాశానికి ఎత్తిన అభిమాని?
3.ఇండ్లకు 24 గంటలు తాగునీటి సరఫరా.. దేశంలో తొలి నగరంగా రికార్డ్