
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలకు గురయ్యారు. తాజాగా పెట్టుబడుల కోసం లండన్ వెళ్లిన బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బ్రిటిషర్లను కీర్తించడం విమర్శలకు దారితీసింది. అయితే లండన్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ… మాట్లాడుతూ ‘ ఐ లవ్ UK ‘ అని… మీకు, మాకు చారిత్రక మరియు వారసత్వ అనుబంధం ఎప్పటినుంచో ఉందని అన్నారు. దాదాపు 190 ఏళ్లు మీరు భారతదేశాన్ని పాలించినప్పుడు కోల్కతానే మీ రాజధాని అని చెప్పుకొచ్చారు. కోల్కత్తా నగరంలో మీరు నిర్మించిన హెరిటేజ్ బిల్డింగ్స్ ను నేను ప్రతిరోజు కూడా తలుచుకుంటూ నే ఉంటానని మమత బెనర్జీ అన్నారు. అయితే ఈ మాటలు విన్న భారతీయ సిటిజన్స్… మమతా బెనర్జీ పై తీవ్రంగా మండిపడ్డారు.
ఎంతోమంది భారతీయుల ప్రాణాన్ని తీసిన బ్రిటిషర్లు అంటే నీకు ఇష్టమా అని మండిపడుతున్నారు. హెరిటేజ్ బిల్డింగ్స్ ను ఏమైనా వాళ్ల సొంత డబ్బుతో నిర్మించారా అని తీవ్రంగా మండిపడ్డారు. అది వాళ్ళ సొంత డబ్బు ఏం కాదని… మన భారతీయుల మాన, ధన, ప్రాణాలను దోచుకుని కట్టినవని నిటిజనులు మమతా బెనర్జీ పై కామెంట్లో రూపంలో మండిపడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా కూడా ఈమె గురించే చర్చ నడుస్తుంది. ఒక భారతీయ ముఖ్యమంత్రి అయ్యుండి వాళ్లకి ఎలా సపోర్ట్ చేస్తావని తీవ్రంగా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక భారతీయ మహిళగా, ముఖ్యమంత్రిగా ఉంటూ బ్రిటీషర్లను కీర్తించడం ఏంటని విమర్శిస్తున్నారు. మరి మమతా బెనర్జీ బ్రిటీషర్ లోని కీర్తించడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.