
Cockroach Coffee (VIDEO): చైనాలో వంటకాల వైవిధ్యం ప్రపంచం అంతటా ప్రసిద్ధమే. అక్కడి ప్రజలకు సాధారణ ఆహార పరిమితులు ఉండవు. కీటకాలు, పురుగులు, పాములు, పక్షులు, జంతువులు ఇలా అనేక రకాల జీవులను వండుకుని తినడం వారి సంస్కృతిలో భాగమైంది. ఈ నేపథ్యలోనే చైనా రాజధాని బీజింగ్‌లోని కీటకాల థీమ్ మ్యూజియం ఇటీవల ఒక అసాధారణ ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
సాధారణ కాఫీకి భిన్నంగా, వారు బొద్దింకలను ఎండబెట్టి మెత్తని పొడిగా తయారు చేసి, దానికి పురుగుల లార్వాల పౌడర్‌ను కలిపి ఒక కొత్తరకం కాఫీ సిద్ధం చేశారు. ఈ కాఫీని స్థానికులు ఎంతో ఆసక్తిగా స్వాగతిస్తున్నప్పటికీ, భారతీయులు ఈ రకమైన ప్రయోగాత్మక పానీయం తాగడం ఊహించడం కూడా కష్టమే.
Exotic coffee with cockroaches and worms is now sold in China, launched by a Beijing museum. Made from safe ingredients from Chinese pharmacies, it offers a unique taste and aroma. Would you try it? pic.twitter.com/gYg134Vbq7
— Телеканал 360.ru (@360tv) November 19, 2025
ఈ కాఫీని రుచి చూసిన వారంతా దానిని ఒక అసాధారణ కులినరీ అనుభవంగా వర్ణించారు. కాఫీకి పుల్లగా ఉండే మట్టి వాసనతో కూడిన స్మోక్ ఫ్లేవర్ లభిస్తుందని చెప్పారు. ధర విషయానికి వస్తే అది కూడా సాధారణం కాదు. ఒక్క కప్పు ధర 45 యువాన్లు అంటే దాదాపు 500 రూపాయలు. అంత ఖరీదైనప్పటికీ ఆ పానీయం చైనాలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ మ్యూజియంలో కేవలం బొద్దింక కాఫీ మాత్రమే కాదు, మరెన్నో విచిత్రమైన పానీయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అసహ్యంగా కనిపించే కాకరకాయ జీర్ణ రసాలతో తయారు చేసిన కాఫీ, ప్రత్యేక చీమల ఎక్స్‌ట్రాక్ట్‌తో తయారు చేసిన పానీయం వంటి వింత ఎంపికలు కస్టమర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.
వింతగా కనిపించినా, ఈ పానీయాలు తాగేటప్పుడు అంత ఇబ్బంది అనిపించదని కస్టమర్లు చెబుతున్నారు. ఒకసారి ప్రారంభమైన అమ్మకాలు గంటల్లోనే ముగిసిపోతున్నాయి. దీనికి మించిన డిమాండ్ ఏముంటుంది! కీటకాల సారాలను మిళితం చేసిన పరిమిత ఎడిషన్ పానీయాలను కూడా మ్యూజియం ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ముఖ్యంగా యువకులు, ఫుడ్ వ్లాగర్లు ఈ వింత కాఫీలను ట్రై చేయడానికి పెద్ద సంఖ్యలో క్యూలు కడుతున్నారు. వారికి ఇది సరికొత్త “షాక్ వాల్యూ డ్రింక్” కంటెంట్. వారి వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ ప్రత్యేక కాఫీ ప్రయోగం చైనాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ALSO READ: ఈనెల 26వ తేదీ నుంచి శుభకార్యాలు చేయొద్దు : వేద పండితులు





