క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపిగా ద్వారక తిరుమల రావు పదవి విరమణ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయనకు గౌరవం సమర్పిస్తూ పలువురు ఐపీఎస్ అధికారులతో సహా చాలామంది అధికారులు ఆయన ప్రయాణిస్తున్న కారును లాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే డిజిపిగా పదవి విరమణ చేస్తున్న ద్వారక తిరుమల రావు మాట్లాడుతూ బాధకు లోనయ్యారు.
మా అన్న చావుకి హైడ్రానే కారణం.. బిల్డర్లు సూసైడ్ చేసుకోవాల్సిందే!
పదవి విరమణ చేయాలంటేనే చాలా బాధగా ఉందని తెలిపారు. ఇకపై నా జీవితంలో యూనిఫామ్ ఉండదని తలుచుకుంటేనే చాలా బాధగా ఉందని డిజిపి తిరుమలరావు భావోద్వేగం వ్యక్తం చేశారు. పోలీసులందరూ కూడా రాష్ట్రంలో విధి నిర్వహర్తులు చక్కగా విధించాలని కోరారు. ప్రజలకు అలాగే రాష్ట్ర అభివృద్ధిలో అందరికీ చేదోడువాదోడుగా ఉంటూ రాష్ట్రంలో కరప్షన్ అనేది తగ్గించాలని కోరారు. పోలీసులందరికి కూడా కొద్దిసేపు విధినిర్వర్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏది ఏమైనా సరే డీజీపీగా పదవి విరమణ చేస్తున్న ద్వారకాతిరుమల రావుకు చాలామంది పోలీస్ అధికారులతో పాటుగా ప్రభుత్వ అధికారులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.