
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదంలో తల దూర్చుతూ సమస్యలను కొని తెచ్చుకునేటువంటి ఆర్జీవి తాజాగా చిరంజీవికి క్షమాపణలు చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరిచాడు. గతంలో రాంగోపాల్ వర్మ చిరంజీవిపై ఎన్నో అభ్యంతరాలను గుప్పించారు . తాజాగా చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కల్ట్ మూవీ గా రూపొందినటువంటి శివ అనే చిత్రం ఈ నెల 14వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో… ఆ చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే చిరంజీవి చేసినటువంటి ట్వీట్ ను రిట్వీట్ చేస్తూ చిరంజీవికి ధన్యవాదములు అని రాసుకోవచ్చారు. అలాగే గతంలో మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు అని రాసుకోవచ్చారు. మీ విశాల హృదయానికి థాంక్యూ అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఇతరులపై వ్యంగ్యంగా కామెంట్లు చేసేటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు అనిపిస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు. కాగా ఈ నెల 14వ తేదీన నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ డైరెక్టర్ గా తెరకెక్కించినటువంటి శివ అనే మూవీ రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించింది అని చెప్పాలి.
Read also : వరల్డ్ కప్ ఎఫెక్ట్… ఈ ప్లేయర్స్ కు భారీగా పెరిగిన బ్రాండ్ వ్యాల్యూ!
Read also : ఎర్రచందనం స్మగ్లింగ్ పై.. డిప్యూటీ సీఎం మాస్ వార్నింగ్!





