
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్
ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. మాధవి అనే ఉద్యోగిని కమిషనర్ చాంబర్ ఎదుట పురుగుల మందు తాగింది. పబ్లిక్ హెల్త్ వర్కర్ గా పని చేస్తున్నపుడు మాదవిని కావాలనే అకారణంగా సస్పెండ్ చేసారని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఆర్ఐగా పని చేసిన సుదాకర్ తనని లైంగికంగా వేదించే వాడని మాధవి గతం లో అధికారులకు పిర్యాదు చేసిన ఎవరూ కూడా పట్టించుకోలేదని వాపోయింది.
ఆర్ఐ సుధాకర్ వేదింపులు తాట్టుకోలేక 2019 పోలీస్ స్టేషన్లో మాధవి పిర్యాదు చేయగానే ఎవరూ కూడా పట్టించు కోలేదని అన్నారు. సుధాకర్ పై కేసు పెట్టిందని కావాలనే ఆసిస్టెంట్ కమీషనర్ తో కలిసి మాదవిని సస్పెండ్ చేశారని మాధవి ఆరోపించారు. గత నాలుగు రోజులు గా కమిషనర్ ను కలిసేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగింది.ప్రస్తుతం మాధవి అనే మహిళను వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సింగర్ కల్పన ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది..? విచారణలో విస్తుపోయే వాస్తవాలు..!
ప్రభుత్వ భూములు అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం: మాజీమంత్రి