
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ప్రజలు కూడా ఈ వర్షాల కారణంగా ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఏర్పడ్డాయి. అందులో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఇలాంటి వర్షాలు పడుతున్న కారణంగా చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పట్టణ ప్రాంతాలలో నిన్న తెల్లవారుజామున కొంచెం సేపు వర్షం పడిపోగా మళ్లీ మధ్యాహ్నం మొదలుకొని ఇవాళ తెల్లవారుజాము వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో హైదరాబాద్ వాసులందరూ కూడా వర్షాన్ని చూస్తూ ఉండడమే తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ఈసారి బతుకమ్మ ఉత్సవాలకు వర్షాలు అడ్డంకిగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు పడుతున్న ప్రాంతాలు
1. జూబ్లీహిల్స్
2. పంజాగుట్ట
3 మియాపూర్
4. బంజారాహిల్స్
5. అమీర్పేట్
6. ఉప్పల్
7. ఎల్బీనగర్
8. సికింద్రాబాద్
9. తార్నాక
10. దిల్షుక్నగర్
11. నాంపల్లి
12. అబిడ్స్
ఈ 12 ప్రాంతాలలో ఇప్పటివరకు కూడా వర్షం పడుతూనే ఉంది. రోజువారి కూలీలకు వెళ్లేటువంటి మనుషులు ఒకచోటనే కూర్చోవాల్సి వస్తుంది. ప్రజల రోజు వారి కార్యకలాపాలు కూడా కాస్త నెమ్మదించాయి. మరోవైపు వాహనదారులు కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడినా పడకపోయినా.. జాబ్స్ కి వెళ్లేవారు అయితే తప్పకుండా ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ ఉత్సవాలు జరుపుకునేందుకు కూడా ఈ వర్షాలు అడ్డుపడుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read also : ప్రజల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
Read also : సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పాజిటివ్ గా తీసుకెళ్లాలి : MLA కోమటిరెడ్డి