ఆంధ్ర ప్రదేశ్

జైలు సమయంలో… అండగా నిలిచారని జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన వంశీ!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ పార్టీ నేత వల్లభనేని వంశీ దాదాపు నాలుగున్నర నెలలు అనగా 140 రోజులకు పైగా విజయవాడ జైల్లో ఉండి బుధవారం నాడు బెయిల్ మీద బయటకు విడుదలయ్యారు. వల్లభనేని వంశీ పై మొత్తంగా 11 కేసులు పెట్టడంతో దాదాపు 140 రోజుల పాటు జైల్లోనే గడిపారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు బెయిల్ కోరినా కూడా రాకపోవడంతో ఇన్ని రోజులు వల్లభనేని వంశీ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఈ జైల్లో ఉన్న సమయంలోనే వల్లభనేని వంశీకి పూర్తిగా అనారోగ్యం బారిన పడ్డారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు వల్లభనేని వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం నాడు విజయవాడ జైలు నుంచి విడుదలై బయటికి వచ్చారు.

ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన వల్లభ నేని వంశీ నేడు తాడేపల్లిలోని వైయస్ జగన్ నివాసానికి వెళ్లారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు వల్లభనేని వంశీ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్ని రోజులపాటు జైల్లో ఉన్నప్పుడు ఎంతోమంది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు వంశీకి అండగా నిలిచారు. అయితే తాజాగా నేడు వల్లభనేని వంశీ ఆయన సతీమణి పంకజశ్రీ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలోనే జైల్లో ఉన్నంతకాలం బయటికి తీసుకురావడానికి అలాగే తమ గురించి ఆరా తీసినందుకు, కష్ట సమయంలో అండగా నిలిచినందుకు జగన్మోహన్ రెడ్డికి వంశీ ఆయన సతీమణి కృతజ్ఞతలు తెలియజేశారు.

జులై నెల మొత్తం వర్షాలే!.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

తెలంగాణలో అభివృద్ధి శూన్యం!..కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button