హైదరాబాద్ లో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు, గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాకు చెక్ పెట్టారు. గౌలిదొడ్డి TNGO’S కాలనీ లో విదేశి అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు నిర్వాహకుడు.కెన్యా,టాంజానియా,బ్యాంకాక్ కు చెందిన యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.
వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటీ,సైబరాబాద్ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. 9 మంది విదేశీ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.