
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సజ్జలదే హవా. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్నా… ప్రభుత్వాన్ని, పార్టీని నడిపింది మాత్రం సజ్జలే. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. వైసీపీ ఘోర ఓటమికి సజ్జలే ప్రధాన కారణమని కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అయినా.. అవన్నీ పట్టించుకోలేదు జగన్. చుట్టూ ఉన్న కోటరీ వల్లే పార్టీకి దూరమవ్వాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి కూడా నెత్తినోరు కొట్టుకుని చెప్పారు. ఆయినా.. సజ్జలను ఏమీ అనలేదు జగన్. కానీ.. ఇప్పుడు ఏమైంది..? సజ్జలపై జగన్‌కు కోపం ఎందుకు వచ్చింది..? ఏ విషయంలో వచ్చింది.
ఘోర ఓటమి మించి తేరుకుంటున్న జగన్.. వైసీపీ బలోపేతంపై దృష్టిపెట్టారు. కీలక నేతలు పార్ట విడిచిపోయినా.. ఉన్నవారితోనే రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వంలో లబ్దిపొందిన వారిని.. ఇప్పుడు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో… జగన్‌కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే… వైసీపీ ప్రభుత్వంలో వందల మంది సలహాదారులు పనిచేశారు. పార్టీ కోసం కష్టపడి చేశారని కొందరని… భవిష్యత్ ఉపయోగపడతారని మరికొందరని ఇష్టమొచ్చినట్టు సలహాదారులుగా నియమించేశారు. ఇవన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. అఅంత మంది సలహాదారులకు పనిలేకపోయినా… టంచన్‌గా ఒకటో తేదీకి లక్ష రూపాయలకు తగ్గకుండా వేతనాలు కూడా చెల్లించారు. ప్పట్లో ఈ విషయం వివాదాస్పదం అయినా.. జగన్ పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతగా లబ్ది పొందిన వారు.. ఇప్పుడు పార్టీ కోసం ఏం చేస్తున్నారు..? అసలు అందుబాటులో ఉన్నారా…? అంటే లేరు. ఎవరికి ఫోన్ చేసినా స్విఛ్ ఆఫ్ అనే వస్తోందట. దీంతో… వైఎస్ జగన్‌కు చిర్రెత్తుకొచ్చిందట. ఎవరిని పడితే వాళ్లు.. ఎంత మందిని పడితే అంతమందిని పెట్టుకుంటే ఎలా అని మండిపడ్డారట జగన్. ఎవరు అక్కరకు వస్తారు..? కష్టకాలంలో ఎవరు మన వెంట ఉంటారో చూసుకునే పనిలేదా..? అంటూ సజ్జలపై ఆగ్రహం వ్యక్తం చేశారట జగన్.
అధికారం ఉంటే.. అందరూ చుట్టూ చేరతారు. ఒక్కసారి పవర్ పోతే.. ఎవరూ వెంట ఉండరు. ఈ విషయం జగన్‌కు ఆలస్యంగా తెలిసొచ్చింది. వైసీపీ హయాంలో 89 మంది సలహాదారులను నియమించుకున్నారు. వీరిలో ఒకరిద్దరు తప్ప… మరెవ్వరూ పార్టీకి అందుబాటులో లేరు. జగన్ ఇప్పటికైనా కళ్లుతెరిచి… ఎవరిని పక్కన పెట్టుకోవాలి… ఎవరిని దూరం పెట్టాలి అనే విషయంపై ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందని విశ్లేషకుల సలహా.