
కరీంనగర్‌లోని సహస్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని శివాన్విత పరీక్షలను రాస్తుండగా.. గదిలో కొక్కెం ఊడిపోయి తిరుగుతున్న ఫ్యాన్ ఊడి పడి శివాన్వితకు ఫ్యాన్ రెక్కలు తగలడంతో ఆమె ముక్కు, కన్ను కింది భాగాల్లో గాయాలయ్యాయి
స్పందించిన సిబ్బంది వెంటనే విద్యార్థినిని పరీక్షా కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరానికి తరలించి చికిత్స చేయించి.. అనంతరం విద్యార్థినిని మరో గదిలో కూర్చోబెట్టి అరగంట సమయాన్ని అదనంగా కేటాయించి పరీక్ష రాయించారు. పరీక్ష ముగిశాక… కేంద్రం నుంచి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు..
ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన నిర్వహించారు. కనీస సౌకర్యాలు లేని కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేశారు. పరీక్ష కేంద్రం వద్ద ధర్నా చేశారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరకొర వసతులతో కూడిన సెంటర్స్ లలో పరిక్ష కేంద్రాన్ని ఎలా నిర్వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలాం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి ..
-
జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి ఆర్ధికసాయం
-
కూతురికి విషం.. కొడుకుకు ఉరి.. చంపేసి చనిపోయిన పేరెంట్స్
-
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హంతకుడికి మరణశిక్ష!..
-
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్స్… నేరగాళ్లు అరెస్ట్!..
-
రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ ఎండలు!… బయటకు రావద్దు అంటున్న అధికారులు?