క్రైమ్

నాయనమ్మ కోసమే పరువు హత్య!సుర్యాపేట కేసులో ట్విస్ట్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన పరువు హత్య కేసులో ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. వడ్లకొండ కృష్ణను హత్య చేసేందుకు అతని భార్య భార్గవికి చెందిన కుటుంబ సభ్యులు నలుగురితో పాటు మరో ఇద్దరు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటలోని జనగామ క్రాస్‌ రోడ్డు సమీపంలోని నిందితుల్లో ఒకరైన బైరు మహేశ్‌ వ్యవసాయ భూమి వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని తెల్లవారుజాము వరకు షికారు చేసినట్లు సమాచారం. చివరికి పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై మృతదేహాన్ని వదిలేసి నిందితులందరూ పరారయ్యారు.

ఇష్టం లేకుండా తమ సోదరి భార్గవిని వివాహం చేసుకోవడంతో రెండు నెలలుగా కృష్ణను అంతం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇందులో తాళ్లగడ్డకు చెందిన బైరు మహేశ్‌తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడి సాయం తీసుకున్నారు. ఈ పథకంలో భాగంగా కొన్నాళ్లుగా కృష్ణతో.. మహేశ్‌ స్నేహం చేస్తున్నట్లు నటించాడు. ఈ పథకాన్ని ఈనెల 19న అమలు చేయాలని చూసినా.. కుదరక ఆదివారం రాత్రి హత్య చేశారు. కృష్ణ హత్య కేసులో ప్రధాన నిందితుడైన కోట్ల నవీన్‌ నానమ్మ బుచ్చమ్మ మొదటి నుంచి మనుమరాలు వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

కొన్ని నెలలుగా తన కుమారుడు, మనుమళ్లను రెచ్చగొడుతూ హత్యకు పరోక్షంగా కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో వేసుకొని ఆత్మకూర్‌ మండలం పాత సూర్యాపేటలో బంధువుల ఇంటి వద్ద ఉన్న బుచ్చమ్మకు చూపించి సంతృప్తి పర్చినట్లు సమాచారం. అనంతరం నల్గొండలో ఉన్న మరో మిత్రుడికీ మృతదేహాన్ని చూపేందుకు వెళ్లారు. ఇలా రాత్రంతా వీరు కృష్ణ మృతదేహంతో షికారు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button