తెలంగాణరాజకీయం

రేవంత్ రెడ్డి మరో షాక్.. హోంమంత్రిగా విజయశాంతి?

తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త ఇంచార్జీగా మీనాక్షి నటరాజన్ రాకతో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండానే హైకమాండ్ నిర్ణయాలు జరిగిపోతున్నాయని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎంపికే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. టీపీసీసీ, సీఎం రేవంత్ రెడ్డితో ఏమాత్రం సంబంధం లేకుండానే ఎమ్మెల్సీ తెచ్చుకుని అందిరికి షాక్ ఇచ్చారు ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతి. ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టు చూశాక తన మైండ్ పోయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారంటేనే తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఊహించవచ్చు.

మీనాక్షి నటరాజన్ కోటాలో రాములమ్మకు ఎమ్మెల్సీ వచ్చిందని గాంధీభవన్ లో చర్చ సాగుతోంది. విజయశాంతికి ఎమ్మెల్సీ రావడమే షాక్ అయితే.. ఆమె మరో సంచలనం చేయబోతుందని తెలుస్తోంది. విజయశాంతికి పార్టీ హైకమాండ్ మరో కీలక బాధ్యత ఇవ్వబోతుందనే టాక్ వస్తోంది. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో రాములమ్మకు బెర్త్ ఖాయమని ఢిల్లీ వర్గాల సమచారం. విజయశాంతిని కేవలం ఎమ్మెల్సీగానే సరిపెట్టకుండా ఆమెకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే విజయశాంతికి కేబినెట్‌ లోకి తీసుకుని.. హోంశాఖ పదవిని అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. రాములమ్మకు హోంశాఖను అప్పగించడం ద్వారా మహిళలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాల్ని పంపాలని భావిస్తోందట.

రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 15 నెలలుగా మంత్రి పదవులు భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా కావడం లేదు. ఇప్పటివరకు దాదాపు 40 సార్లు హస్తినకు వెళ్లి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయిన ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అవుతుందనే చర్చే సాగుతోంది. కాని అది మాత్రం కావడం లేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. నలుగురు కొత్త ఎమ్మెల్సీలు వచ్చినందున.. ఇక మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు. మీనాక్షి నాటరాజన్ ఎంట్రీతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. హైకమాండ్ ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుబోతోందని చెబుతున్నారు. విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా పార్టీకి మరింత బూస్ట్ అవుతుందని హైకమాండ్‌ భావిస్తుందని తెలుస్తోంది.

హోంశాఖను మహిళా నేతకు అవకాశం ఇవ్వడం ద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టినట్టు అవుతుందని కాంగ్రెస్ పెద్దల ప్లాన్ గా తెలుస్తోంది. రేవంత్ మంత్రివర్గంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నా.. కొండా సురేఖ తరుచూ వివాదస్పద కామెంట్స్ చేస్తూ ఇరుకున పడుడుతున్నారు. మరో మంత్రి సీతక్క దూకుడుగానే వెళుతున్నా అమెపై ఏపీ సీఎం చంద్రబాబు ముద్ర ఉంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో ముందున్న.. ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న రాములమ్మను మంత్రివర్గంలోకి తీసుకుని కీలకమైన హోంశాఖను కట్టబెట్టాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button