ఇళ్ల నుంచి బయటికి వస్తే డేంజర్.. డేంజర్ బెల్స్

బయటికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే కాసేపు ఆగండి.. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. కంపల్సరీగా వెళ్లాల్సిన పరిస్థితి అయితేనే ఇంటి నుంచి బయటికి రండి.. లేదంటే మీ గండం మీరు తెచ్చుకున్నట్లే. తెలంగాణ రాష్ట్రాల్లో సూర్యూడు సుర్రుమంటున్నాడు. మండే ఎండలతో ఠాటెత్తిస్తున్నాడు. ఇంటి నుంచి బయటికి వస్తే మాడు పగిలిపోవాల్సిందే. ఇది ఏదో సరదాగా అంటు్నది కాదు.. వాతావరణ శాఖ డేంజర్ ఎలర్చ్ జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మార్చి రెండో వారంలోనే భానుడు భగ్గుమంటున్నడు. మండుతున్న ఎండలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సూర్య ప్రతాపానికిప్రజలు చిటచిటలాడుతున్నారు. ఎండ వేడికి తట్టుకోలేక జనాలు అల్లాడిపోతున్నారు. మార్చి నెలలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింతగా ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో సూర్యుడి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఉత్తర తెలంగాణతో పాటు పోలిస్తే దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తర తెలంగాణలో ఎండతో పాటు వడగాడ్పులు వణికిస్తున్నాయి. 8 జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆ 8 జిల్లాల్లో ఇవాళ టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటవచ్చని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ లోనూ 40 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయ్యే అవకాశం ఉంది.

Read More : మంత్రి పదవిపై ఆశ లేదన్న రాజగోపాల్‌రెడ్డి – ఇస్తే పార్టీకే మేలంటూ మెలిక..!

సాధారణంగా మార్చి నెలలో 35 డిగ్రీల వరకు ఉష్టోగ్రత నమోదవుతుంది. కాని ఈ ఏడాది 40 డిగ్రీలు దాటడంతో చిన్న పిల్లలు.. వృద్దులు ఉక్కపోతకు ఇబ్బంది పడుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే వచ్చే రోజుల్లో పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. జనాలు అ సమ్మర్ హీట్ ను బీట్ చేసేందుకు చల్ల చల్లని,కూల్ కూల్ గా వుండే ఫ్రూట్స్ , సమ్మర్ డ్రింక్స్ ను తీసుకుని ఎండ ప్రతాపాన్నికూల్ చేస్తున్నారు. మరో వైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Exit mobile version